వేసవిలో మధ్యాహ్నం చల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. అప్పుడు కర్బూజ పండ్లతో స్మూదీ చేసుకుంటే సరి. కప్పు పాలు, కప్పు కర్బూజ ముక్కలు, ఒకటిన్నర టీ స్పూన్ తేనె, కొద్దిగా సెలెరీ, కొంచెం వెనిలా ఎక్స్రాక్ట్, కొంచెం నట్మెగ్ పౌడర్ కలపాలి. కొంచెం మిరియాల పొడి, పావు కప్పు కొబ్బరినీళ్లు కూడా కలుపుకుంటే బావుంటుంది. కర్బూజ ముక్కలు, పాలు, తేనె, సెలరీ మిక్సీలో వేసుకుని బ్లెండ్ చెయ్యాలి. తర్వాత నట్మెగ్ పౌడర్, మిరియాల పొడి, వెనిలా ఎక్స్ట్రాక్ట్, కొబ్బరి నీళ్లు కలిపి మరోసారి తిప్పాలి. అంతే.. రుచిగా ఉండే కర్బూజ స్మూదీ రెడీ అయినట్టే. చల్లగా కావాలంటే కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. తాగేముందు పొడవైన గ్లాస్ లో సూదీ వేసి మిగిలిన పండు ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మరింత మజాగా ఉంటుంది. Images Credit: Pexels