పోషకాలు కలిగి, చిటికెలో తయారయ్యే ఆహార పదార్థం కావాలా? అయితే ఈ కొరియన్ వెజ్జీ ప్యాన్ కేక్స్ చేసుకు తినెయ్యండి.

అర కప్పు మైదా పిండి, 1 టెబుల్ స్పూన్ కార్న్ ప్లోర్ అరకప్పు నీళ్లు, క్యారెట్, క్యాప్సికం, ఉల్లి, తగినంత ఉప్పు

ఒక చిన్న గిన్నెలో 2 టెబుల్ స్పూన్ల సోయాసాస్, 1 టెబుల్ స్పూన్ వెనిగర్, కొద్దిగా నువ్వులు, చిల్లీప్లేక్స్ కలిపి పెట్టుకోవాలి.

మైదా, కార్న్ ఫ్లోర్, నీళ్లు కలిపి బ్యాటర్ రెడీ చేసుకోవాలి. అందులో కూరగాయల ముక్కలు వెయ్యాలి

ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. తర్వాత బ్యాటర్ తో గుండ్రంగా దోశలా వేసుకోవాలి.

చిన్న మంట మీద ప్యాన్ కేక్ రెండు వైపుల కాల్చుకోవాలి.

క్రీస్పీగా కాలిన తర్వాత స్టౌ ఆపేయ్యాలి. వేడిగా ఉన్నపుడే తయారు చేసుకున్న సాస్ డిప్ తో తింటే బావుంటుంది.

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.