అరటి పువ్వు కషాయం - ఆ సమస్యలు ఉంటే ఇది తీసుకోండి

అరటి పువ్వు కషాయం చాలా రకాల అనారోగ్యాలను దరిచేరకుండా నివారిస్తుంది.

అరటి పువ్వును శుభ్రం చేసి.. నీటిలో బాగా ఉడికించాలి.

పువ్వు ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు కలపాలి.

ఈ కషాయం కొద్దిగా చల్లారిన తర్వాత జీలకర్ర పొడి, మిరియాల పొడి కలుపుకోవాలి.

తర్వాత దీన్ని వడకట్టాలి. ఇక ఇప్పుడు అరటి పువ్వు కషాయం తాగేందుకు సిద్ధంగా ఉంది.

ఇది తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

అరటిపువ్వు కషాయంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మంచి ఔషధంగా చెప్పవచ్చు.

డయాబెటిక్స్‌కు ఇది చాలా మంచిది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

Image Source: Pexels

మహిళల్లో నెలసరి నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. (ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే)