బొద్దింకలు వేధిస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

ఇంట్లో బొద్దింకలు ఉన్నాయంటే.. వ్యాధులు తిష్టవేసినట్లే. కాబట్టి, వాటిని వదిలించుకోవడం చాలా మంచిది.

అలాగే, బొద్దింకలను తరిమేందుకు కెమికల్స్‌ను ఉపయోగించడం కూడా అంత మంచిది కాదు.

ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నా, కబోర్డ్స్ ఉన్నా.. బొద్దింకలు తిష్టవేసే అవకాశం ఉంది.

బిర్యానీ ఆకుల వాసన బొద్దింకలకు పడదు. వాటిని పొడి చేసి స్టవ్, పదార్థాల చుట్టూ చల్లండి.

బేకింగ్ సోడా, పంచదార కలిపి బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో చల్లండి. మళ్లీ తిరిగి రావు.

కిరోసిన్‌ను నీటిలో కలిపి.. ఇంటి మూలల్లో స్ప్రే చెయ్యండి. ఆహార పదార్థాలపై పడకుండా జాగ్రత్తపడండి.

దాల్చిన చెక్కకు కూడా బొద్దింకలు దూరంగా ఉంటాయి. వాటి ఘాటు వాసన బొద్దింకలకు పడదు.

లవంగాలు సైతం బొద్దింకలను తరిమి కొడతాయి. ఇంటి మూలలు, తడి ప్రాంతాల్లో వాటిని పెట్టండి.

వేపాకులు బొద్దింకలను తరిమేస్తాయి. వాటిని పౌడర్‌గా చేసి వంటింట్లో చల్లండి.

Images Credit: Pexels and Pixabay