ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమాజాన్ని కబళిస్తున్న ఒక పెద్ద ఆరోగ్య సమస్య. అదుపు చెయ్యడం తప్ప చికిత్స లేని ఈ జబ్బును అదుపులో పెట్టుకునేందుకు రకరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో వెల్లుల్లి వినియోగం ఒకటి. వెల్లుల్లి తో మధుమేహులకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, జింక్, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. వెల్లుల్లి హర్మోన్లను సంతులన పరుస్తుంది. కనుక ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ అదుపులో ఉంటుంది. వెల్లుల్లి కార్బోహైడ్రేట్ మెటబాలిజం ను బ్యాలెన్స్ చేస్తుంది. అందువల్ల రక్తంలో షుగర్ స్థాయి స్థిరంగా ఉంటుంది. ప్రతి రోజూ ఉదయాన్నే రెండు వెల్లుల్లిరేకలు వేడినీటితో పరగడుపున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ లో వేయించిన వెల్లుల్లి ని చల్లారిన తర్వాత తిన్నా సరే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే