మంచి అరటి పండ్లను కొనేదెలా? ఇదిగో ఇలా గుర్తించండి

అరటి పండు ఆరోగ్యకరమే. కానీ, రసాయనాల్లో ముగ్గబెట్టే అరటిపండ్లే డేంజర్.

అరటి పండు కొనే ముందు.. దాని రంగు చూడాలి.

పసుపు రంగులో మెరుస్తూ, దాని కాడలు పచ్చగా ఉన్నట్లయితే కెమికల్స్‌ వాడారని అర్థం.

తొక్క మరీ పసుపుగా, పలచగా ఉన్నట్లయితే రసాయనాల్లో ముంచారని అర్థం.

అరటి తొక్కపై చిన్న చిన్న గోదుమ రంగు మచ్చలు ఉండాలి. ఏ మచ్చా లేకపోతే కెమికల్స్‌లో మగ్గపెట్టినట్లు.

రసాయనాల్లో ముంచిన అరటి పండ్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, జర భద్రం.

అరటి పండు కొనలు లేదా తొక్క బూడిద రంగులో ఉంటే వేడి చేసి ముగ్గబెట్టినట్లు అర్థం.

కాబట్టి, సహజసిద్ధంగా పక్వానికి వచ్చే అరటి పండ్లను మాత్రమే కొనాలి.. తినాలి.

విరిగిపోయినా, లేదా కోతలు ఉన్న అరటిపండు అస్సలు కొనకూడదు.

Images Credit: Pixabay