బరువు పెరుగుతున్నందుకు కంగారు పడకుండా ఎందుకు పెరుగుతున్నారో కారణం తెలుసుకోవడం ముందు అవసరం.

ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు. వ్యాయామం తప్పనిసరి. సమతుల ఆహారం తినాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

జీవక్రియల వేగం పెంచే మిరియాలను క్రమం తప్పకుండా ఆహారానికి కొద్ది మొత్తంలో చేర్చువాలి.

అల్లంతో శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గి, రక్తంలో చక్కెర కూడా అదుపులో ఉంటుంది.

జీలకర్ర పొడి శరీరంలో కొవ్వును తగ్గించడం మాత్రమే కాదు.. బీఎంఐ కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతుంది.

మెంతుల్లో ఫైబర్ ఎక్కువ. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం మంచి ఆప్షన్.

వెల్లుల్లి శరీరంలో అనారోగ్యకర కొవ్వు తొలగిస్తుంది. జీవక్రియల వేగాన్ని పెంచుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే



Thanks for Reading. UP NEXT

బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారా?

View next story