ఓట్స్ లో ఫైబర్ తో పాటు సూక్ష్మపోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి అవసరం. ఇలా తయారు చేసుకుని ఒక కప్పు ఓట్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు ఓట్స్ , రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్, రెండు టెబుల్ స్పూన్ల పీనట్ బటర్, ఒక కప్పు పాలు, కొన్ని తరిగిన ఖర్జూరాలు. ముందుగా పాలను 5, 6 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఒక కప్పులో ఓట్స్ తీసుకుని వాటిని 3, 4 నిమిషాల పాటు వేడి నీళ్లలో నాననివ్వాలి. తర్వాత వీటిని వడకట్టాలి. తర్వాత మరిగించిన పాలను ఓట్స్ కి కలుపుకోవాలి. పాలలో కాల్షియం, ప్రొటీన్ ఉంటాయి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, పల్లీలు మీకు నచ్చిన గింజలు కలుపుకోవచ్చు. అవి బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి. చివరగా పీనట్ బటర్, పండిన అరటిపండు ముక్కలు, ఖర్జూర ముక్కలు కలిపితే హై ప్రొటీన్ బౌల్ రెడీ అయినట్టే. ఓట్స్‌తో జీర్ణశక్తి మెరుగవుతుంది. ఎక్కువ పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.