ఉల్లిపాయలు కోస్తుంటే కళ్లు మండుతున్నాయా? ఇలా చేస్తే సరి!

ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కళ్లు మండటం సర్వసాధారణమే.

మరి, మీకు కళ్లు మండకుండా ఉల్లిపాయలు కట్ చేయాలని ఉందా? ఇలా చెయ్యండి.

మీ ఇంట్లో చిన్న టేబుల్ ఫ్యాన్ ఉంటే.. ముఖానికి దగ్గరగా పెట్టుకుని ఉల్లిపాయలు కట్ చెయ్యండి.

కళ్లు మొత్తం కవర్ చేసే గాగుల్స్ పెట్టుకోండి. ‘ఉల్లి’ పవర్ కళ్ల వరకు రాకుండా అడ్డుకుంటాయి.

ఉల్లిపాయలను ఐస్ వాటర్‌లో వేసి కట్ చేస్తే కళ్లు మండవు. కానీ, అవి రుచిని కోల్పోతాయి.

కొవ్వొత్తులు ఉల్లిపాయల నుంచి వచ్చే పవర్‌ను గ్రహిస్తాయి. ఈసారి క్యాండిల్ వెలిగించి ట్రై చెయ్యండి.

బ్రెడ్‌ను నోటిలో పెట్టుకుని ఉల్లిపాయలను కట్ చేస్తే కళ్లు మండవట. మీరు కూడా ప్రయత్నించండి.

Images Credit: Pexels and Pixabay