గుమ్మడి ఎన్నో పోషకాలు కలిగిన కాయగూర. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. గుమ్మడిలో విటమిన్లు A, C, పొటాషియం, కాల్షియం, ఫోలెట్, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలెన్నో ఉంటాయి. గుమ్మడిలో పుష్కలంగా ఉండే బీటాకెరోటిన్, విటమిన్ A వల్ల నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. గుమ్మడిలో ఉండే పొటాషియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. భవిష్యత్తులో కార్డియోవాస్క్యూలార్ సమస్యలు రావు. బీటాకెరోటిన్ వల్ల ఇమ్యూనిటీ మాత్రమే కాదు కంటి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. విటమిన్ C, E , బీటాకెరోటిన్ తో కలిసి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. పైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మలబద్దకం నివారించబడుతుంది. డయేరియా తగ్గిస్తుంది. క్యాలరీలు తక్కువ కనుక బరువు అదుపులో ఉంచుతుంది. కడుపు నిండుగా ఉన్న భావన కలిగి క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది. యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల గుండె సమస్యలు, ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. గుమ్మడిలో నీటి శాతం ఎక్కువ కనుక శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ప్రసరణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.