ఎండాకాలంలో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. అందుకు రోజువారి భోజనంలో ఈ కూరగాయలు చేర్చుకోవడం మంచిది. కీరదోసకాయల్లో దాదాపుగా 95 శాతం నీరే ఉంటుంది. వీటిని సలాడ్ లోనూ, తాగే నీటిలో వేసి కూడా వాడుకోవచ్చు. టమాటల్లోనూ చాలా నీరుంటుంది. వీటిని సలాడ్ లోనూ, సాండ్విచ్ లోనూ వాడుకుంటే హైడ్రేటెడ్ గా ఉండొచ్చు. జుకినిలో కూడా నీరెక్కువ. దీనిని గ్రిల్ చేసి, రోస్ట్ చేసి లేదా స్పైరలైజ్ చేసి కూడా తీసుకోవచ్చు. క్యాప్సికం స్లైసులుగా సాండ్విచ్ లోనూ, చిన్న ముక్కలుగా సలాడ్ లోనూ, కొద్దిగా టాస్ చేసి, గ్రిల్ చేసి ఎలా తీసుకున్నా మంచిదే. ముల్లంగిలో 95 శాతం నీరే. దీన్ని సలాడ్ లోనూ క్రిస్ప్ స్నాక్ గానూ ఉపయోగించుకోవచ్చు. ఈ కూరగాయలన్నీ కూడా ఎండాకాలం హైడ్రైటెడ్ గా ఉండేందుకు దోహదం చేస్తాయి. వేడి తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.