వేసవి వచ్చేసింది. ఎండలు కూడా మండుతున్నాయి. ఈ టైమ్‌లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిందే.

మనం ఆరోగ్యం ఉండాలంటే శరీరానికి నీరు చాలా అవసరం.

ముఖ్యంగా వేసవి కాలంలో నీరు తాగడం చాలా ముఖ్యం.

అయితే, అదే పనిగా నీరు తాగినా.. లేదా మొతాదు కంటే తక్కువ తాగినా నష్టమే.

వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. ఒక పరిమితిలో నీరు లేదా ద్రవాలు తీసుకోవాలి.

డాక్టర్ల సూచన ప్రకారం డైలీ 2.7 నుంచి 3.7 లీటర్ల నీరు తాగాలి.

అంటే సుమారు రోజూ 10 నుంచి 14 గ్లాసుల నీరు తాగాలి.

అయితే, నీరు మాత్రమే తాగాలని రూల్ లేదు. కొబ్బరి నీరు నుంచి జ్యూస్‌ల వరకు ఏవైనా తీసుకోవచ్చు.

దీనివల్ల మీరు వేసవిలో వడగాల్పులకు గురికాకుండా సేఫ్‌గా ఉంటారు.

Images and Video Credits: Pexels and Pixbay