అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి చేరుకున్నారు.

అయితే ఆమె 9 నెలలు పైగా అంతరిక్షంలో ఉన్నందుకు ఆమెకు ఎంత జీతం వస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

సునీతా విలియమ్స్ నాసా వ్యోమగామి కాబట్టి ఆమె అధికారిక జీతవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.

జీఎస్-12 నుంచి జీఎస్ 15 పే స్కేల్​ చూస్తే వీరి జీతం సంవత్సరానికి 85 వేల డాలర్ల నుంచి 1,50,000 డాలర్లు వరకు ఉంటుంది.

అంతరిక్షంలో దీర్ఘకాలిక మిషన్లకు వెళ్లేవారికి అదనపు భత్యాలు, బోనస్​లు రావచ్చు.

వార్షిక జీతం కోటిగా లెక్కేసుకున్నా.. తొమ్మిదినెలలకు సుమారు 75 లక్షలు సునీతా విలియమ్స్​కి రావొచ్చు.

సునీతా విలియమ్స్ వ్యోమగామిగా ఆరోగ్య బీమా, పెన్షన్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతారు.

నాసా వ్యోమగాములు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రైవేట్ కంపెనీల నుంచి డైరక్ట్ పేమెంట్స్ ఉండవు.

SpaceX నిర్వహించే మిషన్లలో ప్రయాణించినప్పటికీ వారి జీతాలు మాత్రం NASA చెల్లిస్తుంది.

సుదీర్ఘ అంతరిక్ష కార్యకలాపాల్లో భాగం అయినందుకు భవిష్యత్తులో శాలరీ పెరిగే అవకాశముంది.