మానవ శరీరం ఎంత వేడిని తట్టుకుంటుంది మానవ శరీరం ఉష్ణోగ్రతల శ్రేణిని తట్టుకుంటుంది. మానవ శరీరం ఎంత వేడిని తట్టుకుంటుందో తెలుసుకుందాం. సాధారణ కోర్ శరీర ఉష్ణోగ్రత సుమారు 37C.కోర్ శరీర ఉష్ణోగ్రత 40Cఅంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు ప్రమాదకరంగా మారతుంది. హీట్ ఎగ్జాషన్ లేదా హీట్ స్ట్రోక్ వంటి వేడి సంబంధిత అనారోగ్యాలకు దారితీయవచ్చు. హీట్ ఇండెక్స్ గాలి ఉష్ణోగ్రత, తేమను కలిపి అది ఎంత వేడిగా ఉంటుందో ప్రతిబింబిస్తుంది. హీట్ ఇండెక్స్ 39C నుంచి 42Cకి చేరినప్పుడు అది వేడి సంబంధిత అనారోగ్యానికి ప్రమాదం కలిగిస్తుంది. 54 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణ సూచిక చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. నిమిషాల్లో హీట్ స్ట్రోక్ కు కారణం అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలలో ప్రత్యేకించి 35 C కంటే ఎక్కువ తేమతో శరీరం చెమట ద్వారా చల్లబరచడానికి కష్టపడుతుంది. శీతలీకరణ లేదా ఆర్ధ్రీకరణ లేకుండా 54C లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ సమయం ఉంటే ప్రాణానికి ముప్పు