బాస్లా నిద్రించాలా? ఇలా చేయండి మీరు బాగా నిద్రించినప్పుడు ప్రశాంతంగా ఉంటారు. రోజంతా హ్యాపీగా గడుస్తుంది. నిద్రలేమి చిరాకు, కోపానికి కారణం అవుతుంది. మంచి నిద్ర భావోద్వేగాలను నియంత్రించడంలో, మానసికస్థితిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు నిద్ర అవసరం. బాగా విశ్రాంతి తీసుకుంటే శరీరం ఇన్ఫెక్షన్ నుంచి పోరాడుతుంది. నిద్రలేమి ఉంటే అధిక బరువు, ఊబకాయంతో బాధపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి ఆకలిని నియంత్రించే హార్మోన్లకు అంతరాయం కల్గిస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర గుండె జబ్బులు, షుగర్, స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది. శరీరానికి తగినంత నిద్రను అందిస్తే ఇలాంటి ప్రమాదాల తగ్గించడంలో సహాయపడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.