బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఎన్ని బాదం పప్పులు తినాలి?

Published by: Geddam Vijaya Madhuri

బరువు తగ్గడానికి రోజుకు 5 నుంచి 8 బాదంపప్పులు తింటే సరిపోతుంది.

వర్కౌట్ చేసే వ్యక్తులు రోజుకు 8 నుంచి 10 బాదంపప్పులు తినవచ్చు.

బాదం రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినడం చాలా ఉత్తమం.

నానబెట్టిన బాదం పప్పులు సులభంగా జీర్ణం అవుతాయి. పైగా వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్E పుష్కలంగా ఉంటాయి.

బాదం తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది.

ఎక్కువ బాదం పప్పు తినడం వల్ల కేలరీలు పెరిగిపోవడం వల్ల బరువు పెరగవచ్చు.

బాదంపప్పులో ఉండే మెగ్నీషియం శరీరానికి శక్తిని ఇస్తుంది.

బాదంపప్పుతో మసాలా లేదా ఉప్పు కలిపి తీసుకోవడం మానేయాలి.

నట్స్ అలర్జీ ఉంటే డాక్టర్ సలహా తర్వాతే తినాలి.