పోషకాలు పుష్కలంగా ఉండే గుడ్డు ఉడికించడానికి ఓ పద్ధతి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు



పోషకాలు పోకుండా గుడ్డును ఎలా ఉడికించాలో చెప్పిన అమెరికా శాస్త్రవేత్తలు



గుడ్డు సరిగ్గా ఉడకాలంటే మరుగుతున్న నీటితోపాటు గోరు వెచ్చని నీటిలో ఉడికించాలట.



ముందుగా మరుగుతున్న నీరున్న పాత్రలో గుడ్డును రెండు నిమిషాలు ఉడికించాలి



తర్వాత తీసి గోరువెచ్చని నీరున్న పాత్రలోకి తీసుకొని మరో రెండు నిమిషాలు ఉంచాలి



ఆ తర్వాత మళ్లీ మరుగుతున్న పాత్రలోకి మార్చాలి



ఇలా ప్రతి రెండు నిమిషాలకోసారి 32 నిమిషాలు చేయాలట



ఆఖరిగా చల్లటి నీటిలో ఉంచిన తర్వాత పెంకును వేరు చేససి తినాలి.



గుడ్డు ఉడికిన తర్వాత ఒకపూట బయట ఉంచవచ్చు.



ఫ్రిడ్జ్‌ ఉంచాలనుకుంటే మాత్రం పెంకు తీయకుండానే పెట్టాలి



ఇలా పెంకు తీయకుండా ఉడికించిన గుడ్డును వారం రోజులు నిల్వ చేయవచ్చు



పెంకు తీసిన గుడ్లు అయితే మాత్రం గాలి దూరని ప్రదేశంలో రెండు మూడు రోజులు ఉంచవచ్చు