హలో.. కాస్త నవ్వచ్చుగా? ఈ లాభాలన్నీ మీకే! నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. మరి ఆ మూడిట్లో మీరు ఏ రకానికి చెందినవారు? మీరు చివరి రకమైతే.. చాలా నష్టపోతారు. ఎందుకంటే.. నవ్వలేకపోవడం నిజంగా రోగమే. కాబట్టి, నవ్వండి.. నవ్వించండని చెబుతున్నారు నిపుణులు. నవ్వడం వల్ల సంతోషాన్ని అందించే హార్మోన్లు యాక్టీవ్ అవుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. నవ్వు మన మెదడులోని భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నవ్వినప్పుడు మెదడులోకి రక్తం ప్రసరిస్తుంది. మనసు ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఆనందం లభిస్తుంది. మీరు నవ్వుతూ ఉండటం వల్ల ఇతరులకు కూడా నచ్చుతారు. నవ్వు మీలో పాజిటివిటీ పెంచుతుంది. నవ్వు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నిపుణులు స్పష్టం చేశారు. నవ్వినప్పుడు ఏర్పడే ఎండార్ఫిన్లు నొప్పిని తగ్గిస్తాయని, గుండెకు కూడా మేలు చేస్తాయని నిపుణులు వెల్లడించారు.