మీరు స్నానం చేసే విధానం సరైనదేనా? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే?

మీరు రోజూ స్నానం చేస్తున్నారా? ఎన్ని గంటలకు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు?

మేం స్నానం ఎలా చేస్తే మీకెందుకు అనేగా అంటున్నారు. అయితే, ఆయుర్వేదంలో స్నానానికి కొన్ని రూల్స్ ఉన్నాయ్.

స్నానం అనేది కేవలం శరీరాన్ని శుద్ధి చేసేది కాదు. మనసును కూడా శుద్ధి చేసేదని ఆయుర్వేదం చెబుతోంది.

ప్రాచీన ఆయుర్వేదంలో స్నానం ఎలా చెయ్యాలి? ఎలా చేయకూడదో రాసి ఉంది.

ఆయుర్వేదం ప్రకారం.. సూర్యోదయానికి ముందే స్నానం చెయ్యాలి.

ముఖ్యంగా గజేంద్రుడిలా స్నానం చెయ్యాలి. అంటే శరీరమంతా నీటిలో తడవాలి.

స్నానాన్ని ఎప్పుడూ చల్లని నీటితోనే చెయ్యాలి. ఇందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది.

చన్నీటితో స్నానం చేస్తే రక్త నాళాలు కొత్త రక్తాన్ని కణితి (ట్యూమర్)కు చేరనివ్వవు.

దానివల్ల ట్యూమర్‌లకు ప్రోటీన్స్ అందవు. తద్వారా క్యాన్సర్ వంటి రోగాలను అరికట్టవచ్చు.