ఆమె కంట్లో జిగ్ జాగ్ గీతలు, నల్ల మచ్చలు - చూపు కూడా మాయం, ఫోన్ వల్లేనా? రోజూ అదేపనిగా మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ టీవీలను చూస్తూ గడిపేస్తున్నారా? హైదరాబాద్‌లోని ఓ మహిళకు వచ్చిన ఈ కంటి సమస్య గురించి తెలిస్తే.. మళ్లీ మీరు అలా చెయ్యరు. ఇటీవల ఆమె డాక్టర్‌ను కలిసి తనకు కళ్లు మసకగా కనిపిస్తున్నాయని చెప్పందట. అంతేకాదు.. కళ్లలో నల్ల మచ్చలు(ఫ్లోటర్స్), జిగ్ జాగ్ లైన్స్ కనిపిస్తున్నాయని డాక్టర్‌తో చెప్పారట. డైలీ 15 నుంచి 20 నిమిషాలు కంట్లో అలాంటి ‘గందరగోళం’ కనిపించేదట. నిద్రలో నుంచి లేవగానే.. 2 లేదా 3 నిమిషాలపాటు ఆమెకు ఏమీ కనిపించేది కాదట. ఈ కేసును స్టడీ చేసిన వైద్యులు.. ఆమె కంట్లో, కంటి నరాల్లో ఎలాంటి సమస్యలేదని తేల్చారు. అదేలా? మరి ఆమెకు ఎందుకు అలా అనిపిస్తోందనేగా మీ సందేహం? దీనికి కారణం మొబైల్ ఫోన్. డైలీ, రాత్రి పగలు తేడా లేకుండా ఆమె మొబైల్ ఫోన్ చూసేదని.. అందుకే ఆ సమస్య వచ్చిందని తెలిసింది. ఈ సమస్యను స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటారు. బాధితురాలు ఫోన్ చూడటం మానేశాక సమస్య తగ్గిందట.