దోమలను తరిమేయాలా? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వర్షాలు పడుతున్నాయి. దోమలు కూడా దాడికి సిద్ధంగా ఉన్నాయి.
మస్కిటో కాయిల్స్, లిక్వెడ్స్‌తో దోమలు పోవు, పైగా అవి హానికరం కూడా.
అందుకే, ఈ సింపుల్ టిప్స్ పాటించి దోమలను తరిమేయండి.
లావెండర్ పూలు యాంటీఫంగల్.. వీటిని ఇంట్లో పెట్టుకుంటే దోమలు రావు.
దాల్చిన చెక్క నూనెను శరీరానికి రాసుకుంటే దోమలు దరిచేరవు.
వేప నూనెను శరీరానికి రాసుకుంటే దోమలు దరిచేరవు. అలర్జీలు ఉంటే వద్దు.
యాపిల్ సైడర్ వెనిగర్, కర్పూరం మిశ్రమాన్ని ఇంట్లో స్ప్రే చేసినా దోమలు రావు.
కర్పూరం, కొబ్బరి నూనె మిశ్రమాన్ని శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టవు.
వెల్లులి వాసన కూడా దోమలకు పడదు. దాని పేస్ట్‌ను నీటిలో కలిపి స్ప్రే చెయ్యండి.