హార్మోన్ల ప్రభావం వల్ల చాలామందికి ముఖంపై హెయిర్ వస్తుంది. అవి ముఖం అందాన్ని డల్ చేసేస్తాయి. అయితే ఇంటిచిట్కాలతో వీటికి చెక్ పెట్టవచ్చు. గుడ్డులో పంచదార, మొక్కజొన్న పిండి మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవచ్చు. ఓట్మీల్లో తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. బొప్పాయిలో చిటికెడు పసుపు వేసి మాస్క్ వేసుకుని డ్రై అయ్యాక చల్లని నీటితో కడగాలి. పాలల్లో పసుపు వేసి చిక్కటిపేస్ట్లా తయారు చేసుకుని ప్యాక్ వేసుకోవాలి. మైదాపిండిలో పసుపు, పెరుగు, నిమ్మరసం కలిపి స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. అరటిపండులో ఓట్స్ పౌడర్, తేనె కలిపి అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)