జుట్టు పెరుగుదలలో కర్పూరం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అయితే దీనిని తలకి ఎలా అప్లై చేయాలో చాలామందికి తెలియదు. కర్పూర పొడిని పెరుగులో కలిపి స్కాల్ప్‌కి మాస్క్ వేయాలి. కొబ్బరి నూనెలో కర్పూరం మిక్స్ చేసి తలకు మసాజ్ చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుంది. సీసమే లేదా జోజోబా ఆయిల్లో మందార, కర్పూరం కలిపి తలకు అప్లై చేయవచ్చు. కొబ్బరి నూనె, వేపాకులు కలిపి మరిగించి.. చల్లారక కర్పూరం కలిపి అప్లై చేసుకోవచ్చు. కర్పూరాన్ని తలకు ఎలా అప్లై చేసినా.. అరగంట తర్వాత కచ్చితంగా తలస్నానం చేయాలి. కర్పూర వాసన మంచి అరోమాను ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. నిపుణుల సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Pinterest)