మెడ చుట్టూ నల్లగా అవుతోందా? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి సమ్మర్లో చెమట, ఎండవల్ల శరీరంలో టాన్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మెడ దగ్గర నల్లగా మారుతుంది. దీనిని తగ్గించుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. కీరాదోస తురుముతో మెడపై మసాజ్ చేసుకుంటే డర్ట్ పోతుంది. టమాటో గుజ్జులో నిమ్మరసం, తేనె వేసి దానిని మెడకు అప్లై చేస్తే మంచి ఫలితముంటుంది. బంగాళా దుంపల గుజ్జులో నిమ్మరసం వేసి.. దానిని ప్యాక్‌గా వేసుకోవాలి. శనగపిండిలో పసుపు వేసి.. పాలతో మిక్స్ చేసి మెడకు అప్లై చేయవచ్చు. రెగ్యూలర్‌గా వీటిని ఫాలో అవుతూ ఉంటే.. నలుపుదనం పోతుంది. ఇవి అవగాహన కోసం మాత్రమే. మంచి ఫలితాలకోసం నిపుణులను సంప్రదించండి. (Images Source : Envato)