Image Source: pexels

రంగు పడిందా? నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు తప్పవు

హోలీ సందర్భంగా విక్రయించే రంగుల్లో విషపూరిత రసాయనాలు ఉంటాయి. గూలాల్ లో గాజు కణాలు కూడా ఉంటాయి.

రంగుల్లో ఉండే రసాయనాల్లో మెర్క్కూరీ సల్పైట్, లెడ్ ఆక్సైడ్, కాపర్ సల్పేట్ ,మలాకైట్, రోడమైన్, జెంటియన్ వైలెట్ ఉన్నాయి.

ఈ రంగులన్నీ చాలా విషపూరితమైనవి. మలాకైట్ గ్రీన్ క్యాన్సర్ కు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ రసాయనాలతో నిండిన హోలీ రంగులు చర్మంపై పూసినప్పుడు దద్దుర్లు, అలెర్జీలు, చర్మం రంగు మారటం జరుగుతుంది.

చర్మంపై రంగులు పడినప్పుడు కొందరి బొబ్బలు వంటి తీవ్రమైన చర్మ ప్రతిచర్యలు ఉంటాయి.

తామర వంటి చర్మ సంబంధిత అలెర్జీలకు దారి తీస్తుంది. పొక్కులు, పొలుసులు, చర్మం చికాకు , దురదకు దారి తీస్తాయి.

రంగులు అలెర్జీలు, కార్నియల్ రాపిడి, కండ్లకలక వంటి కంటి సమస్యలను కూడా కలిగిస్తాయి.

కళ్లు ఎర్రబడటం, వాపు, నీరు కారడం వంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది.

రంగు నోటిలోకి పోతే ఆస్తమా, బ్రోన్కైటిస్, క్రానిక్, అబ్ర్ట్సక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటివి తీవ్రం అవుతాయి.

Image Source: pexels

బయట విక్రయించే రంగుల్లో చిన్న పీఎం 10 కణాలు ఉంటాయి. వాయిమార్గాన్ని దెబ్బతీస్తాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది.