చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. స్వయంవరంతో హీరోయిన్గా మారింది లయ. 1999 నుంచి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి సక్సెస్‌ను చూసింది. లయ అప్పుడు ఎంత ఫిట్‌గా ఉండేదో.. ఇప్పుడు కూడా అంతే ఫిట్‌గా ఉంటుంది. నాలుగు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ అలాగే ఉండడానికి కారణం రెండు పూటల మాత్రమే భోజనం చేస్తుందట. బ్రేక్‌ఫాస్ట్ తినడం పూర్తిగా మానేశానని.. కానీ మధ్యహ్నా భోజనం 11 గంటలకే తినేస్తానని తెలిపింది. రెండుసార్లే తిన్నా.. కడుపు నిండుగా భోజనం చేస్తానని తెలిపింది. మధ్యలో స్నాక్స్ జోలికి కూడా పోదట. ఇంట్లోపనితో పాటు.. డ్యాన్స్ తనని ఫిట్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తున్నాయని చెప్తుంది లయ. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీ శారీరక సామర్థ్యతను బట్టి వీటిని ఫాలో అవ్వొచ్చు. లయ ఫోటోలు(Images Source : Instagram/layagorty)