ఈ సంకేతాలున్నాయంటే మీ మ్యారేజ్ లైఫ్‌లో హ్యాపీగా లేనట్టేనట పెళ్లి జీవితం అందరికీ పూల మీద పాన్పు కాదు. కొందరికి అదొక నరకం. మీ రిలేషన్లో కొన్ని మార్పులు గమనిస్తే.. అది మీరు మ్యారేజ్ లైఫ్‌లో హ్యాపిగా లేనట్టు అర్థం. ఏ రిలేషన్లో అయినా కొత్తలో బాగానే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్ది అది మారుతూ ఉంటుంది. రిలేషన్స్‌లో గొడవలు కామన్. కానీ ప్రతి గొడవ పరిధి దాటిపోతుంటే టాక్సిక్‌గా మారుతుందని తెలుసుకోవాలి. ఎమోషనల్‌గా మీ పార్టనర్‌తో దగ్గరవ్వలేకపోతున్నారా? అయితే మీరు హ్యాపీగా లేరని అర్థం. ఫిజికల్, ఎమోషనల్ ఇంటిమెసీ తగ్గిపోతుందంటే అది మీ రిలేషన్‌ని దూరం చేస్తుంది. మీ పార్టనర్ మీకు టైమ్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తుంటే అది మీ రిలేషన్లో రెడ్ ఫ్లాగ్ అని అర్థం. మీ పర్సనల్ గోల్స్‌ని ఫాలో అవ్వకుండా అడ్డుపడితే అది కచ్చితంగా టాక్సిక్ రిలేషనే. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)