కొరియన్ ఫుడ్‌ను ఇష్టపడేవారు వారి టిప్స్‌ను, డైట్‌ను ఫాలో అయ్యి బరువు తగ్గవచ్చు. బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడం కోసం, చర్మం మెరవడం కోసం కొరియన్ ఫుడ్ డైట్ సాయం చేస్తుంది. తక్కువగా లేదా సరిపడా తినడం వల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుందని కొరియన్స్ నమ్ముతారు. గోధుమలు, డైరీ, షుగర్, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాకింగ్, హైకింగ్ లాంటి ఫిజికల్ యాక్టివిటీలు తప్పనిసరి. ఎక్కువగా కూరగాయలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ చేకూరుతాయి. నూనెతో చేసిన ఆహార పదార్థాలకు, ఫ్రై చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది. నిల్వ ఉండే ఆహార పదార్థాల్లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో కిమ్చీ అనే కొరియన్ ఫుడ్ ఐటెమ్ చాలా ఫేమస్. ఫుడ్ డైట్ ఎలా ఉన్నా కూడా నడవడం వల్లే శరీరం అత్యంత ఆరోగ్యంగా ఉంటుందని కొరియన్స్ నమ్ముతారు. నోట్: ఈ చిట్కాలు అవగాహన కోసం మాత్రమే. (All Images Credit: Pexels)