హెర్బల్ టీలో దాదాపు కెఫిన్ ఉండదు. కాబట్టి వీటివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. యాంటీఆక్సిడెంట్లు హెర్బల్ టీలో పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినడాన్ని తగ్గిస్తాయి. చమోలీ, లావెండర్, పెప్పర్మింట్ ఒత్తిడిని తగ్గించి.. ప్రశాతంతను అందిస్తాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. హెర్బల్ టీలు ఎక్కువ ఫ్లేవర్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఫ్రూట్స్, ఫ్లోరల్ ఫ్లేవర్స్ కూడా తీసుకోవచ్చు. పాలతో చేసిన టీలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పైగా వీటిలో షుగర్ కూడా వేస్తారు. షుగర్‌ని కంట్రోల్ చేసుకునేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి హెర్బల్ టీ బెస్ట్ ఆప్షన్. గుండె ఆరోగ్యానికి పాలతో చేసిన టీ అంత మంచిది కాదని పలు అధ్యయనాలు తెలిపాయి. మిల్క్‌తో చేసిన టీ తాగితే బ్లోటింగ్ వస్తాది. జీర్ణ సమస్యలు పెరుగుతాయి. హెర్బల్ టీతో గట్ సమస్యలు ఉండవు. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.