అవిసెగింజలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని డైట్​లో వివిధ రకాలుగా చేర్చుకోవచ్చు.

ఇవి అందానికి, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. కాబట్టి వీటిని డైలీ తినొచ్చు.

ఓట్​మీల్ లేదా యోగర్ట్​లో కలిపి అవిసెగింజలను పొడిగా చేసి కలిపి పోషకాహారంగా తీసుకోవచ్చు.

పాలల్లో లేదా నీటిలో అవిసెగింజల పొడి వేసి.. రాత్రంతా ఫ్రిడ్జ్​లో ఉంచి.. ఉదయాన్నే ఫ్రూట్స్, నట్స్​తో తినొచ్చు.

1 టేబుల్ స్పూన్ అవిసెగింజల్లో 3 టేబుల్ స్పూన్​ నీటిని వేసి గుడ్డుతో చేసే బేకింగ్ వంటల్లో దానికి బదులుగా ఇది వేసుకోవచ్చు.

స్మూతీలలో అవిసెగింజల పొడి వేసుకుని తాగినా మంచిదే. జ్యూస్​లలో వేసుకోవచ్చు.

సలాడ్స్​లో పైన కోటింగ్​గా వీటిని వేసుకుని తినొచ్చు. క్రంచీ ఫీలింగ్ వస్తుంది.

రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ మొదలు పెట్టి.. దాని వినియోగం పెంచుకోవచ్చు.

వీటిని ఎయిర్​టైట్​ కంటైనర్​లో స్టోర్​ చేస్తే పోషకాలు కోల్పోకుండా ఎక్కువకాలం ఉంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.