నెయ్యిని జుట్టుకి అప్లై చేస్తే ఇన్ని బెనిఫిట్సా? తలకి ఆయిల్ అప్లై చేస్తారు. కొన్ని రకాల క్రీమ్‌లు అప్లై చేస్తారు. అయితే తలకి నెయ్యి అప్లై చేయొచ్చా? అంటే కచ్చితంగా చేయవచ్చు అంటున్నారు. డ్రై, డ్యామేజ్ అయిన హెయిర్‌ని నెయ్యి మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుందని తెలిపారు. స్కాల్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసి.. మృదువైన, షైనీ హెయిర్ ఇస్తుందట. గోరువెచ్చని నెయ్యితో తలకు మసాజ్ చేస్తే తలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. నెయ్యి హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేసి.. దృఢంగా మారేలా చేస్తుంది. దీనిలోని విటమిన్ ఏ, డి రఫ్నెస్ని దూరం చేసి.. స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చేస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)