పెట్ పేరెంట్స్‌కి ఉండే అతి పెద్ద డౌట్లలో ఇది కూడా ఒకటి. వాటికి ఫ్రూట్స్ పెట్టాలా? వద్దా? అయితే కొన్ని ఫ్రూట్స్ వాటికి హ్యాపీగా పెట్టవచ్చట. అవేంటంటే.. తాజా బ్లూబెర్రీలును పెట్స్‌కి పెట్టవచ్చు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ జీర్ణక్రియకు మంచివి. క్రంచీగా ఉండే కీరదోసలు వాటికి తినిపించవచ్చు. విటమిన్స్, కార్బోహైడ్రెట్స్ వీటికి అందుతాయి. పైనాపిల్స్‌లో విటమిన్స్, మినరల్స్, కాల్షియం ఉంటుంది. అయితే పచ్చివి పెడితేనే మంచిది. పుచ్చకాయలు డాగ్స్‌కు సూపర్‌ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిలో విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం ఉంటాయి. అరటిపండులో పొటాషియం, విటమిన్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి పెట్స్‌కి మంచివి. సమ్మర్లో మామిడిపండ్లు పెట్టవచ్చు. ఇవి జీర్ణక్రియకు మెరుగైనవి. (Images Source : Unsplash)