ఉసిరి కాయలు విటమిన్ C తో నిండి ఉంటాయి. ఇమ్యూనిటి పెమచుతాయి. వేసవిలో తరచుగా వేడి చేస్తుంటుంది కొందరికి. అలాంటి వారు ఉసిరి వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరితో శరీరంలో చలువ చేస్తుంది. హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మలబద్దకం, అసిడిటి వంటి సాధారణ జీర్ణసమస్యలను ఉసిరి నివారిస్తుంది. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల యూవీ కిరణాల వల్ల చర్మానికి నష్టం జరగకుండా కాపాడుతుంది. ఉసిరి శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. వేసవి ఎండ తాపానికి జుట్టు పొడిబారి నష్టం జరగకుండా కాపాడుతుంది. వేసవి వేడి వల్ల మధుమేహుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా అదుపులో ఉంచుతుంది. వేసవి తాపానికి నీరసం, అలసట ఆవరించకుండా ఉసిరి కాపాడుతుంది. ఈ సమాాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.