ఆరోగ్యకరమైన ఫుడ్స్ ఎప్పుడూ దంత సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

అయితే నోటి ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. అవేంటంటే..

ఆకు కూరల్లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి దంత సంరక్షణకు చాలా మంచివి.

పెరుగులోని ప్రోబయోటిక్స్ నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. నోటి దుర్వాసనను కూడా పోగొడతాయి.

స్ట్రాబెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి దంత సంరక్షణకు మంచిది.

చీజ్​లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇవి దంతాలు స్ట్రాంగ్​గా ఉండేలా చేస్తాయి.

గ్రీన్​ టీలో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పిప్పళ్లు, నోటి సమస్యలను దూరం చేస్తాయి.

యాపిల్స్ నోటి సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)