రోజును హెల్తీగా స్టార్ట్ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

బరువును తగ్గేందుకు, ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉదయాన్నే కొన్ని డ్రింక్స్ తీసుకుంటే మంచిది.

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది.

ఇది కడుపులోని టాక్సిన్లను బయటకు పంపి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

పరగడుపున తాగేందుకు అల్లం టీ కూడా చాలా మంచి ఆప్షన్.

ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేయడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది.

గ్లాసు వాటర్​లో ఓ టేబుల్​స్పూన్ నెయ్యి వేసుకుని తాగితే శరీరానికి మెటబాలిజం అందుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్​లో నీళ్లు కలిపి తాగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

గమనిక : ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)