ఇమ్యూనిటీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.

అందుకే పిల్లలకు ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ పెట్టాలంటున్నారు నిపుణులు.

ఉదయాన్నే పలు ఆహారాలను బ్రేక్​ఫాస్ట్​గా ఇస్తే రోజంతా ఎనర్జిటిక్​గా ఉండడమే కాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

కూరగాయలతో చేసిన మసాల ఓట్స్​ను పిల్లలకు బ్రేక్​ఫాస్ట్​గా ఇవ్వాలి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

పెసరపప్పుతో చేసిన వంటల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండడమే కాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది.

ఉడకబెట్టిన గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి.

పోహా కూడా బ్రేక్​ఫాస్ట్​కి మంచి ఆప్షన్. ఇది కడుపు నిండుగా ఉంచి.. బలాన్ని అందిస్తుంది.

మల్టీగ్రైయిన్ ఇడ్లీ, దోశలు ఇమ్యూనిటీ బూస్టర్లుగా పని చేస్తాయి.

యోగర్ట్​ను సలాడ్స్​లో లేదా నేరుగా తీసుకోవచ్చు. పెరుగు కూడా మంచిదే.

ఇవన్నీ సీజనల్​ వ్యాధులను దూరం చేస్తాయి. (All Images Source : Envato)