చాలామంది ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా లంచ్ తర్వాత నడిచేందుకు ఆసక్తి చూపిస్తారు.

కొందరేమో భోజనం చేసిన వెంటనే నడవకూడదంటారు. మరి లంచ్ తర్వాత నడవాలా వద్దా?

లంచ్ తిన్న పది నిమిషాల తర్వాత వాకింగ్​కు వెళ్తే మంచిదంటున్నారు నిపుణులు.

ఇలా చేయడం వల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

అంతేకాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను ఈ అలవాటు దూరం చేస్తుంది.

శరీరంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. మధుమేహమున్నవారు కచ్చితంగా నడవాలి.

నడక ద్వారా శరీరంలో కేలరీలు కరిగి మెటబాలీజం పెరుగుతుంది. తద్వార బరువు తగ్గుతారు.

నడక వల్ల శరీరంలో ఎండోర్ఫిన్స్ విడుదలై ఒత్తిడిని తగ్గిస్తాయి.

శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి.. తలనొప్పిని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

అందుకే మీల్ చేసిన తర్వాత వాక్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. (Images Source : Envato)