స్ట్రాబెర్రీలు తింటే ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచివేనా? ఒకప్పుడు స్ట్రాబెర్రీలు తినేవారు చాలా తక్కువ. ఇటీవల మార్కెట్‌లో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. మరి.. స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి మంచివేనా? మీ శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? స్ట్రాబెర్రీల్లో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు కూడా యాపిల్‌కు చెందిన రోసేసి జాతికి చెందినవే. కాబట్టి, ఆరోగ్యానికి మంచివే. స్ట్రాబెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అంతేకాదు.. యాంటీఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నుంచి కూడా రక్షిస్తాయి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్-C క్యాన్సర్, బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుంది. స్ట్రాబెర్రీలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. డయాబెటిస్ రోగులు కూడా వీటిని తినొచ్చు. అయితే, స్ట్రాబెర్రీలను కడిగి నిల్వ చేయకూడదు. తినే ముందు మాత్రమే కడగాలి.