కుంకుమ పువ్వు కేవలం గర్భిణీలకే అనే అపోహ కొందరిలో ఉంటుంది.

అయితే దీనిని ఆరోగ్య ప్రయోజనాల కోసం అందరూ తీసుకోవచ్చు అంటున్నారు.

కోపం, ఇరిటేషన్, చిరాకు వంటి వాటిని కుంకుమపువ్వు పోగొడుతుంది.

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి.

బరువు తగ్గాలనుకునేవారు రెగ్యూలర్​గా దీనిని స్నాక్స్​లో లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు.

కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి.. గుండె సమస్యలను దూరం చేస్తుంది.

రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. మధుమేహమున్నవారు తీసుకోవచ్చు.

కంటి చూపును మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తర్వాత పాటించాలి. (Images Source : Unsplash)