హెల్తీ స్నాక్స్​గా నట్స్ తీసుకోవడం వల్ల పిల్లలకు, పెద్దలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

పోషకాలతో నిండిన ఈ నట్స్ కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేస్తాయి. వీటిలోని హెల్తీ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి.

బీపీని కంట్రోల్ చేసి.. గుండె సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడడంలో హెల్ప్ చేస్తాయి.

నట్స్​లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్ నిండుగా ఉంటాయి. ఇవి కడుపును నిండుగా ఉంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

వీటిని డైట్​లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు అందడంతో పాటు, బరువు తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలిపాయి.

మెటబాలీజంను పెంచి.. కేలరీలు కరగడంలో హెల్ప్ చేస్తాయి. ఎనర్జిటిక్​గా ఉంటారు.

బ్రెయిన్​ హెల్త్​కి మంచివి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మూడ్​ని మెరుగుపరుస్తాయి.

హాజెల్​నట్స్​లోని యాంటీఆక్సిడెంట్లు న్యూరో హెల్త్​ని మెరుగుపరిచి.. దానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి.

కణాలు దెబ్బతినకుండా క్యాన్సర్ సమస్యలను దూరం చేసే యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి.

ఇవే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అయితే ఇవి కేవలం అవగాహన కోసమే.