వెల్లుల్లి లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అలిసిన్ వంటి సమ్మేళనాలు నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

వెల్లుల్లితో బీపి అదుపులో ఉంటుంది. రక్తనాళాలు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

క్రమం తప్పకుండా వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వెల్లుల్లి కడుపులో జీర్ణరసాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. పోషకాల శోషణ మరింత బాగా జరుగుతుంది.

వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. శరీరంలో నుంచి వ్యర్థాలు తొలగించబడుతాయి.

వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి వస్తుంది.

కొన్ని అధ్యయనాలు వెల్లుల్లితో రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయని చెబుతున్నాయి.

జీవక్రియల వేగం పెంచుతాయి కాబట్టి కొవ్వు చేరకుండా బరువు కూడా అదుపులో ఉంటుందని కొందరు నిపుణుల అభిప్రాయం.

యాంటీఆక్సిడెంట్ల వల్ల వెల్లుల్లితో ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గి చర్మం యవ్వనంగా ఉంటుంది.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే