ఉదయం పరగడుపున ఉప్పు కలిపిన నీళ్ళు తాగడం వల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉప్పు కలిపిన నీళ్ళు తాగడం వల్ల మొటిమలు, ఎక్జిమా, సోరియాసిస్ లక్షణాలు తగ్గుతాయి. చర్మం నుంచి టాక్సిన్లు బయటకు విసర్జితం అవుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణరసాల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది. పోషకాలు త్వరగా శోషించుకోబడతాయి. సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉప్పు నీళ్ల వల్ల శరీరంలో నిలిచి ఉంటాయి. శరీరం నుంచి టాక్సిన్లను విసర్జించేందుకు ఉప్పు కలిపిన నీళ్లు చాలా ఉపయోగ పడతాయి. కిడ్నీ పనితీరు కూడా మెరుగవుతుంది. ఉప్పు కలిపిన నీళ్లు తాగడం వల్ల మెగ్నిషియం స్థాయిలు తగినంతగా ఉండి ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండవచ్చు. కొద్ది మొత్తంలో తాగే ఉప్పు కలిపిన నీళ్లతో బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.