అదేంటంటే

ఉదయాన్నే టీలో అది వేసుకుని తాగితే ఎంత మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కను టీలో వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏంటి?

బరువు తగ్గేందుకు

ఉదయాన్నే దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే.. మెటబాలీజం పెరుగుతుంది. ఇది బరువును తగ్గించడంతో పాటు శరీరానికి శక్తిని అందిస్తుంది.

జీర్ణక్రియ

మీకు జీర్ణ సమస్యలుంటే.. రోజూ ఉదయాన్నే దాల్చిన చెక్క టీ తాగొచ్చు. ఇది కడుపు ఉబ్బరాన్ని, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

షుగర్ కంట్రోల్

దాల్చిన చెక్కతో చేసిన టీ బ్లడ్ షుగర్​ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగకుండా హెల్ప్ చేసి.. మధుమేహాన్ని కంట్రోల్​లో ఉంచుతుంది.

యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు

దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని మంటను, వేడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ఇమ్యూనిటీ..

దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచి ఇన్​ఫెక్షన్లతో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి.

మెదడు ఆరోగ్యానికై..

ఈ హెర్బల్​ని రోజూ తాగితే మెదడుకు చాలా మంచిది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పనిపై ఫోకస్ చేయగలిగే యాంటీఆక్సిడెంట్లను ఇది కలిగి ఉంది.

గుండె ఆరోగ్యానికై..

చెడు కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసి.. గుండె సమస్యలను తగ్గిస్తుంది. హెల్తీ హార్ట్​ను ప్రమోట్ చేస్తుంది.

అవగాహన కోసమే

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా పాటిస్తే మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి.