కొబ్బరి పాల టీ తాగితే ఎన్ని బెనిఫిట్సో తెలుసా? చాయ్ లో చాలా రకాలు ఉంటాయి. మనదేశంలో చాలా మంది టీ తాగనిది క్షణం ఉండలేరు. కొబ్బరిపాల టీ ఎప్పుడైనా తాగారా? అయితే, మీరు దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకోవల్సిందే. కొబ్బరిపాలలో ఉండే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడంలో సహాయపడతాయి. కొబ్బరిపాల టీ సువాసన, రుచి మనస్సుకు అతుక్కుంటుంది. కొబ్బరి పాల టీ తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి పాల టీ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలను అందిస్తుంది. కొబ్బరిపాలతో తయారు చేసిన టీ ఇమ్యూనిటీని పెంచుతుంది. కొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.