వేసవిలో పెరుగు తినకపోతే కష్టమే! మనలో చాలా మంది పెరుగులేనిది అన్నం తినరు. భోజనం చివరిలో కచ్చితంగా పెరుగు ఉండాల్సిందే. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, ఫ్లూ సమస్యను తగ్గిస్తుంది. వేసవిలో తప్పకుండా పెరుగు తినాలి. లేదా మజ్జిగ రూపంలో తీసుకోవాలి. లేకపోతే వేడిని తట్టుకోలేరు. పెరుగుకు రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గిస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచిది. పెరుగు ఒక శీతలీకరణ ఏజెంట్. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. ఎముకలకు బలం, ప్రేగు కదలికలకు, రక్తప్రసరణ, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఇతర పాల ఉత్పత్తులు తినేప్పుడు పెరుగు తక్కువగా తినాలి. నిద్రించే ముందు పెరుగు తినకూడదు. శ్లేష్మ స్రావాలు గొంతులో ఇబ్బంది పెడతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి