రాత్రంతా బెండకాయ ముక్కలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బెండకాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్లు A,C, Kతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. బెండకాయ నీళ్లు తాగితే ఈ పోషకాలన్నింటిని శరీరం త్వరగా శోషించుకుంటుంది. బెండకాయలో ఫైబర్ చాలా ఎక్కువ. కనుక రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బెండకాయలో జిగటగా ఉండే మ్యూసిలేజ్ ఉంటుంది. ఇది మల విసర్జన సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. బెండకాయ క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కనుక కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గవచ్చు. బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C ఉంటాయి. ఇవి ఇమ్యూనిటిని బలోపేతం చేస్తాయి. ఈ సమాచారం అవగాహన కోసమే.