చన్నీటి స్నానం ఆరోగ్యానికి మంచిదేనా?

మీరు రోజు ఏ నీటితో స్నానం చేస్తున్నారు? చన్నీళ్లా? వేన్నీళ్లా?

డైలీ మీరు వేడి నీళ్ల స్నానం చేస్తున్నట్లయితే.. ఈ విషయం తెలుసుకోవల్సిందే.

చన్నీటి స్నానం ఆరోగ్యానికి చాలామంచిది. రక్తనాళ సంకోచానికి సహకరిస్తుంది.

దానివల్ల రక్త నాళాలు విస్తరించి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

చన్నీటి స్నానం.. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంటు వ్యాధులతో పోరాడే శక్తి ఇస్తుంది.

చల్లని నీరు జీవక్రియ పెరుగుదలకు సహకరిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

చన్నీటి స్నానం చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. బ్యాక్టీరియా లోపలికి రాకుండా నిరోధిస్తుంది.

చల్లని నీటితో స్నానం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. బాగా నిద్రపడుతుంది.

Image Source: Pexels

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగానకు మాత్రమే.