అరిటాకులో తింటే కలిగే ప్రయోజనాలు ఇవీ అరిటాకులో యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఉంటాయి. దానిల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావు ఇందులో పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఆహారంలో కలిస్తే పోషకాలు పెరుగుతాయి. అరిటాకులో తినడం వల్ల రోగాల బారిన పడటం బాగా తగ్గుతుంది అరటి ఆకులో తింటే.. ఆహారం ఎలా ఉన్నా తినేందుకు రుచిగా అనిపిస్తుంది అరిటాకుపైన వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది. వేడి ఆహారం పెడితే అది కరిగి ఫుడ్ ని టేస్టీగా చేస్తుంది. అరిటాకులు బయోడీగ్రేడబుల్, తొందరగా మట్టిలో కలిసిపోతుంది. సింథటిక్ ఇస్తరాకుల్లో ఆహారం కలుషితం అవుతుంది. అరిటాకుల్లో అలా కాదు. కాలుష్యం ఏర్పడదు. అరిటాకులో తింటే ఆహారం త్వరగా, తేలికగా జీర్ణం అవుతుంది. చక్కగా ఆకుపచ్చ రంగులో ఆహారాన్ని వడిస్తే చూసే వారికి కూడా మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది.