అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దానిని తినే విధానంలో ఓ మార్పు చేస్తే ఇంకా మంచిదట. అంజీర్‌ను నేరుగా కాకుండా నానబెట్టి తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ తింటే మంచిది. మహిళల్లో మెటాబాలీజం, స్టామినాను పెంచుతుంది. కాబ్టటి రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. అంజీర్‌లోని మినరల్స్ బోన్ హెల్త్‌ని మెరుగుపరుస్తాయి. ఫిగ్స్‌లోని డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. దీనిలోని విటమిన్ ఎ,సి,ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసి స్కిన్‌కు మంచి ఫలితాలు ఇస్తాయి. నానబెట్టిన అంజీర్‌ను రోజూ తింటే జుట్టు పెరుగుదల మంచిగా ఉంటుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)