జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే ఇది మీకోసమే వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య కాస్త ఎక్కువగా ఉంటుంది. తలలో చేయి పెడితే చాలు జుట్టు అలా కుచ్చులా రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్యను కంట్రోల్ చేయడానికి పలు డైట్ టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు. ఓమేగా 3 కలిగిన అవిసె గింజలు, వాల్ నట్స్, చియా సీడ్స్ డైట్లో కలిపి తీసుకోవాలి. కరివేపాకును కూడా మీ డైట్లో చేర్చుకుంటే జుట్టుకు పోషకాలు అందుతాయి. ఖర్జూరాలు, హాలిమ్ సీడ్స్, మునగాకు వంటివాటిలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టుకి మంచిది. ప్రోటీన్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికే కాదు జుట్టుకి కూడా చాలా మంచివి. నేరేడు పళ్లను వర్షాకాలంలో తీసుకుంటే చాలా మంచిది. ఇవి కొల్లాజెన్ అందిస్తాయి. పంచదార కలిగిన స్వీట్స్ తీసుకోకపోవడమే మంచిది. జుట్టుకు కూడా ఇది మేలు చేస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. (Images Source : Envato)